Magazines

కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి వేడుకలు

1 గంట క్రితం

konda laxaman bapuji
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని భక్తి మార్కండేయ ఆలయం ఆవరణలో ఆచార్య కొండ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వాత్రంత్ర సమర యోధులు తెలంగాణతొలి ఉధ్యమకారులు తెలంగాణ పోరాటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి పదివికి రాజీనామా చేసిన తొలి నాయకులనీ, హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదివికి రాజీనామా చేసిన నాయకుడిగా చెరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.

కొమరం భీమ్ జిల్లా వంకిడిలో జన్మించారని చెప్పారు. ఆయన జననం 27 సెప్టెంబర్ 1915 తెలంగాణ పోరాటం కోసం జీవితం పనిచేసారు. తెలంగాణ భావనం కొరకు హైదరాబాద్ లో గల తన స్వంతా భవనాన్ని త్యాగం చేశారు. చేనేత కార్మికుల కోసం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన త్యాగాధనుడని గుర్తు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఉస్కాల్ వార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రచ్చ కుశాల్ కుమార్, ఉపఅధ్యక్షులు దేవిదాస్, కోశాధికారులు వెంకటేష్,  ఉత్తుర్ శ్రీనివాస్, పద్మశాలి కులబంధువులు,డాక్టర్ సంగమేశ్వర్,కన్నా లక్ష్మణ్ ,శ్సుంకి శ్రీధర్, దత్తురామ్, రాజేష్, సుదర్శన్, నాగనాథ్, సిద్దురమేశ్వర్, మాణిక్  తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్