Magazines

చతుర్థా మహాసభను విజయవంతం చేయండి

2 గంటల క్రితం

madnoor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

మద్నూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈనెల 28న నిర్వహించే చతుర్థా మహాజనసభకు సంగం సభ్యులందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాజనసభలో ఎజెండా అంశాలు, అధ్యక్షుడి సందేశం, అతిథుల సందేశం 2025-26 ఆడిట్ నివేదిక సమర్పణ, సంఘం నివేదిక, ప్రస్తుతం, భవిష్యత్తు పాలకవర్గం ఆమోదం, ఎఫ్పిఓ సుస్థిర అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ మద్దతు ధర, సోయా, కందులు, కొనుగోలు కేంద్రాలు తగినన్ని ఏర్పాటు గురించి ఎన్ ఎం ఈ ఓ ఈ స్కీం ద్వారా రబ్బి సన్ఫ్లవర్ సబ్సిడీ విత్తనాల ప్రణాళిక గురించి అడిషనల్ చైన్ వ్యాల్యూ స్కీమ్ లో భాగంగా ప్రొసీసింగ్ యూనిట్ ప్లాంట్ కొరకు భూమి సమీకరణ ఎం ఎస్ పి రేట్ ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు కేంద్రం కొరకు ఈ సంయుక్తి పోర్టల్ లో సభ్యులు ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటి ప్రాముఖ్యత గల మహాజన సభకు సంఘంలో గల సభ్యులందరూ పెద్ద సంఖ్యలు హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్