నవతెలంగాణ- జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో 'ఎస్.ఎల్.ఎన్. గ్రూప్ రియల్ ఎస్టేట్' చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్మయి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీపతి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కేక్ కట్ చేసి, వారికి అన్నదానం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా నాగపూర్ నుండి మేడ్చల్ వరకు తమ సంస్థ ప్లాట్లను అందిస్తోందని, వ్యాపారంతో పాటు సామాజిక దృక్పథంతో బ్రాహ్మణపల్లి గ్రామంలో విద్యార్థుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ శివప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీపతి భూమిక నర్సారెడ్డి, శ్యామ్, స్వప్న, విజయ, లావణ్యలతో పాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎల్ఎన్ గ్రూప్ చైర్మన్ జన్మదిన వేడుకలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)