Magazines

లష్కరే తోయిబా టాప్ కమాండర్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్‌

54 నిమిషాల క్రితం

Suleman Shah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. సెంట్రల్ కశ్మీర్‌లోని బద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఓ టాప్ కమాండర్ హతమయ్యాడు. హతమైన ఉగ్రవాదిని సులేమాన్ షా అలియాస్ 'మూసా' లేదా 'ఫౌజీ మూసా'గా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బద్గాం జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన యూస్‌మార్గ్‌ పరిధిలోని కోరాగ్ ఏరియాలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. యూస్‌మార్గ్‌లోని దూద్‌పత్రి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గమనించిన సైనికులు, వారిని లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు దీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సులేమాన్ షా అక్కడికక్కడే హతమయ్యాడని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్