Magazines

రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత

1 గంట క్రితం

heroin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : అరేబియా సముద్రంలో రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను భారత తీర రక్షక దళం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో ఓ ఇరాన్ పడవను అడ్డగించిన తర్వాత, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సమన్వయంతో భారత కోస్ట్ గార్డ్, సుమారు 526 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  సెప్టెంబర్ 25న ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరకులో హెరాయిన్, మెథాంఫేటమిన్‌ ఉన్నాయి. ఆ నౌకను నడుపుతున్న ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్