Magazines

రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్

2 గంటల క్రితం

రాజకీయాల్లోకి దివ్య మిట్టల్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే, ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగా ప్రజలతో కలిసి ఒక కొత్త వేదికను ఏర్పాటు చేస్తానని తెలిపారు. 13 ఏళ్ల సర్వీసుకు ఇటీవల స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆమె, మంగళవారం ఓ వీడియో సందేశం ద్వారా తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.

"ఐఏఎస్‌కు ఎందుకు రాజీనామా చేశానని చాలామంది అడుగుతున్నారు. దానికి సమాధానం ఇదే.. నా తదుపరి అడుగు రాజకీయమే" అని ఆమె తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌నే తన కర్మభూమిగా అభివర్ణించిన దివ్య, ఇక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. "నేను ఏ పార్టీ జెండా మోయను. ప్రజలతోనే నా రాజకీయ ప్రయాణం. ప్రభుత్వ కార్యాలయాలకు రాలేని సామాన్యుల గొంతుకగా మారతాను. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా.. పాఠశాలలు, రోడ్లు, ఉపాధి, పరీక్ష పేపర్ల లీకేజీ వంటి సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నిస్తాను" అని ఆమె పేర్కొన్నారు. తనకు మద్దతు ఇవ్వాలనుకునే వారి కోసం వాట్సాప్ నంబర్ (9198956957)ను కూడా విడుదల చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్