Magazines

విషాదం: ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి

58 నిమిషాల క్రితం

Boy dies after mistaking injection
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ లోని శాలిబండలో విషాద ఘటన జరిగింది. ఫాతిమా హాస్పిటల్‌లో సోమవారం ఉదయం ఇంజెక్షన్ వికటించి 9 నెలల బాలుడు మహమ్మద్ హమ్జా మృతిచెందాడు. జ్వరం ఉన్న బాలుడికి ఇంజెక్షన్ ఇవ్వొద్దని తండ్రి కోరినప్పటికీ, డాక్టర్ అవేజ్ మిర్జా ఇంజెక్షన్ ఇవ్వడంతో బాలుడి పరిస్థితి విషమించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్