ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ - మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించే ఈ పోస్టుకు నెలకు రూ.16,500 గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. బి.ఇడి(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా సాధారణ బి.ఇడితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా అర్హత గల మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు ఈ నెల 2 నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తులను మోడల్ స్కూల్ లో సమర్పించాలని కోరారు.






కామెంట్‌లు (0)