మండలంలో 3,072 దరఖాస్తులు
నవతెలంగాణ - మల్హర్ రావు
సాదాబైనామా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని పలు సమీక్షల్లో జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. అయినా మండలంలోని ఆట గ్రామాల్లో 3,072 వేల దరఖాస్తులు పరిష్కారానికి నోచడం లేదు.
తెల్లకాగితాలపై...
తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు.దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.కాగితాలపై రాసుకున్న కొనుగోళ్లకు చట్టపరమైన హక్కు లను కల్పించేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2017,2020లో దరఖాస్తులను స్వీకరించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014, జూన్ 2వ తేదీ కంటే ముందు కాగితాలున్న వారికి ఈ అవకాశం కల్పించింది.కానీ అప్పట్లో దరఖాస్తులు పరిష్కారం కాలేదు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 'భూభారతి' చట్టం తెచ్చింది.2020, అక్టోబరు 12 నుంచి అదే ఏడాది నవంబరు 10 వరకు వచ్చిన 3,072 దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించగా..అదీ నెరవేరడం లేదు.
నోటీసులపై కొనసాగుతున్న విచారణ
సాదాబైనామా దరఖాస్తుదారులకు గత ఆగస్టులో నోటీసులు జారీ చేశారు.క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించారు. ప్రస్తుతం 'సర్' విధులు నిర్వహిస్తుండడంతో కొన్ని మండలాల్లో రెవెన్యూ సిబ్బంది సాదాబైనామా జోలికి వెళ్లడం లేదు. పట్టాలు మంజూరైతే సాదాబైనామా సమస్య పరిష్కారం కానుంది.బ్యాంక్ రుణ సదుపాయం, రైతు బీమా ఇతర పథకాలన్నీ వర్తిస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తు న్నారు.






కామెంట్‌లు (0)