Magazines

దామరకుంటలో పశువైద్య శిబిరం

53 నిమిషాల క్రితం

Veterinary camp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

కాటారం మండలంలోని దామరకుంట గ్రామంలో పందుల పెంపకం చేస్తున్న రైతులు గతంలో పందులలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలియజేయడంతో, వారి విజ్ఞప్తి మేరకు గురువారం కాటారం మండల పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ పందుల ఫారాలను సందర్శించి పందుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పందుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి,అవసరమైన పశువైద్య సేవలను అందించడంతో పాటు పశువైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.


పందులలో వ్యాధుల నివారణ, పరిశుభ్రత, షెడ్ల నిర్వహణ, బయోసెక్యూరిటీ చర్యలు ఆరోగ్య పరిరక్షణపై రైతులకు తగిన సూచనలు అందించారు. అదేవిధంగా విబిజి రాంజి పథకం కింద పందుల పెంపకానికి అవసరమైన షెడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే విధానం ప్రభుత్వ పథకాల ద్వారా లభించే అవకాశాలపై పంచాయతీ కార్యదర్శి పందుల ఫారాల రైతులతో చర్చించారు. పందుల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజశేఖర్, ఎల్‌ఎస్‌ఏ రాజేందర్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్