Magazines

ఈసీ అధికారులు బీజేపీతో కుమ్మక్కై పని చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌

1 గంట క్రితం

Danam Nagender
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నేతలు వ్యవస్థీకృతమైన ఓట్‌ చోరీకి పాల్పడుతున్నారని.. ఈసీ తక్షణమే స్పందించి, తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు. ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం తగలబడిపోతుంది’’ ఆయన అంటూ వ్యాఖ్యానించారు.తన నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తొలగించారని.. ఈసీ అధికారులు బీజేపీతో కుమ్మక్కై వారికి అనుబంధంగా పనిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆరోపించారు.


మరోవైపు ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు, పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆమె దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్