43,000 పైగా అవుట్ లెట్లలో విక్రయం..!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త వ్యాపారాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా సొంత బ్రాండ్‌తో ప్యాకేజింగ్ తాగునీటిని మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 43 వేలకు పైగా పెట్రోల్ బంకులు ద్వారా తొలుత ఈ మంచినీటి బాటిళ్లను విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఈ తాగునీటి విక్రయాల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చని యాజమాన్యం అంచనా వేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)