Magazines

‌రాష్ట్ర ప్రభుత్వానిది తుగ్లక్‌ నిర్ణయం

1 గంట క్రితం

state government's decision
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

టన్ను విదేశీ బొగ్గు రూ.9 వేలకు దిగుమతి

ఈ భారాన్ని ప్రజలెందుకు మోయాలి? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
టన్నుకు రూ.3,800 ఖర్చయ్యే సింగరేణి బొగ్గును వద్దనడం టన్నుకు రూ.తొమ్మిది వేలు ఖర్చయ్యే విదేశీ బొగ్గు దిగుమతికి మాత్రం సరే అనడం కాంగ్రెస్ ప్రభుత్వ మరో 'తుగ్లక్' నిర్ణయమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు ‌(కేటీఆర్‌) విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌మంగళవారం ఎక్స్‌ ‌వేదిక ద్వారా ట్వీట్‌ ‌చేశారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ భారాన్ని ఎందుకు మోయాలని అడిగారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలకు బొగ్గును సరఫరా చేసేది సింగరేణి సంస్థేనని తెలిపారు. సింగరేణి బొగ్గును ఉపయోగించకుండా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోని తొమ్మిదిన్నర ఏండ్లలో సింగరేణి బొగ్గును ఉపయోగించి టీఎస్ జెన్‌కో ద్వారానే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో అది ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్