Magazines

రబీ పంటలకు ఎంఎస్‌పీ

47 నిమిషాల క్రితం

MSP for Rabi crops
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

కేంద్ర మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం
ఆరు పంటలకే మద్దతు ధరలు గతంతో పోలిస్తే
గోధుమల ఎంఎస్పీ అంతంతే


నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
2027–28 మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ మంత్రివ‌ర్గ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. కుసుమ (సాఫ్‌ఫ్లవర్‌)కు క్వింటాల్‌కు అత్యధికంగా రూ.675 పెంచగా, గోధుమలకు అత్యల్పంగా రూ.25 మాత్రమే పెంచారు. కొత్త ధరల ప్రకారం గోధుమల ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ.2,585 నుంచి రూ.2,610కి చేరింది. బార్లీ రూ.2,150 నుంచి రూ.2,286కి, శనగలు రూ.5,875 నుంచి రూ.5,958కి పెరిగాయి. మసూర్‌ పప్పు ఎంఎస్పీ రూ.7,000 నుంచి రూ.7,390కి చేరింది. రేప్‌సిడ్‌, ఆవాలకు రూ.6,200 నుంచి రూ.6,613కు పెంచారు. కుసుమకు రూ.6,540 నుంచి రూ.7,215కు చేరింది. గతంతో పోలిస్తే గోధుమల ఎంఎస్పీ పెంపు గణనీయంగా తగ్గింది. 2026–27 మార్కెటింగ్‌ సీజన్‌లో గోధుమలకు క్వింటాల్‌కు రూ.160 పెంచగా, ఈసారి రూ.25 మాత్రమే పెంచారు. అదే సమయంలో కుసుమ, రేప్‌సీడ్‌–ఆవాలు, మసూర్‌ వంటి పంటలకు అధిక పెంపు లభించింది. అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III పథకానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల (జీడబ్ల్యూ ) పునరుత్పాదక విద్యుత్ సరఫరాకు వీలుగా దేశ అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థ (ఐఎన్ఎస్‌టీఎస్)ను బలపరుస్తుంది. రూ.1,86,405 కోట్ల వ్యయంతో 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III (జీఈసీ-III)తో అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థ (ఐఎన్ఎస్‌టిఎస్) అభివృద్ధికి రూ.1,36,378 కోట్లు, 50 జిడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బిఈఎస్ఎస్) కోసం రూ.50 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మొత్తం రూ.54,082 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. అంతర్రాష్ట్ర గ్రిడ్ చార్జీలను భర్తీ చేసేందుకు, విద్యుత్ ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ఆర్థిక సహాయం (సీఎఫ్ఏ) సహాయపడుతుంది. ప్రభుత్వ మద్దతు అంతిమంగా తుది వినియోగదారులైన భారత పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఢిల్లీలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ బ‌లోపేతంలో భాగంగా ‘వన్ నెట్‌వర్క్, స్మార్ట్ ట్రాఫిక్‌’ ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ. 1,789.52 కోట్ల ఖ‌ర్చు చేయ‌నుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సాఫీగా, సమర్థవంతంగా మార్చనున్న ఏఐ-ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, టెక్నాలజీ ఆధారిత నిబంధనల అమలు, రియల్-టైమ్ ట్రాఫిక్ సమాచార వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తారు. మూడు దశల్లో ఢిల్లీకి చెందిన 42 ట్రాఫిక్ కారిడార్లు దీని పరిధిలోకి రానున్నాయి. అంబులెన్స్‌ల రాకపోకలకు ప్రాధాన్యత కల్పించడానికి, రద్దీని- రోడ్డు ప్రమాదాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దోహదపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్