Magazines

జనాభా గణాంకాల కమిటీని రద్దు చేయాలి

51 నిమిషాల క్రితం

population
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) డిమాండ్‌

న్యూఢిల్లీ : జనాభా మార్పులపై వేసిన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌‌సీడీసీ) ఏర్పాటు వెనుక గల అనుమానాస్పద ఉద్దేశం బయటపడింది. ఈ కమిటీ అడుగుతున్న వివిధ ప్రశ్నల గురించి మీడియాలో వచ్చిన వార్తా కథనాల నేపథ్యంలో ఈ విషయం బహిర్గతమైంది. కమిటీని ఏర్పాటు చేస్తున్నపుడే సిపిఎం తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేసింది. తన భయాందోళనలను వెలిబుచ్చింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రక్రియను చేపట్టిన రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మతాల వారీ సమాచారం చెప్పాలని కోరడంతో సహా కమిటీ అడుగుతున్న ప్రశ్నావళిలో పలు అంశాలు వున్నాయి. పాఠశాలల్లో నమోదులు పెరిగాయా, ఎస్‌‌టిల మార్పిడి, భూ యాజమాన్య మార్పులు, ఓటర్ల నమోదు, ఆధార్‌ ‌కార్డుల జారీ వంటి ప్రశ్నలు వున్నాయి. మైనారిటీలపై దాడి జరపాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌/‌బిజెపి సొంత ఎజెండాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే ఉద్దేశ్యంతోనే ఇదంతా జరుగుతోందన్న తమ భయాందోళనలు ఈ ప్రశ్నలు ధ్రువీకరించాయని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. ఈ ప్రక్రియను ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌‌ నుంచి అలాగే ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన నుంచి విడిగా చూడలేమని కూడా ఆ ప్రకటన పేర్కొంది. ఓటర్ల జాబితాల నుంచి తొలగించబడిన వారి మతం గురించిన సమాచారాన్ని కూడా హెచ్‌ఎల్‌‌సీడీసీ కోరుతోంది. సర్‌, జన గణన, నియోజకవర్గాల పునర్విభజన, జనాభా కమిటీ ఇవన్నీ కలిస్తే పౌరసత్వానికి, ప్రాతినిధ్యానికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి, సామాజిక, మత సామరస్యతకు సుదూర కాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగించే ప్రమాదముందని పొలిట్‌‌బ్యూరో హెచ్చరించింది.పైగా జన గణన కొనసాగుతున్న సమయంలో ఈ ప్రక్రియను చేపట్టడంతో ఇది మరింత అసహ్యకరంగా తయారైంది. నిజానికి, జనాభాలో వస్తున్న ధోరణులను గుర్తించడానికి జనగణన అనేది ప్రాతిపదికగా వుంటుంది. జనాభా ధోరణుల్లో వస్తున్న మార్పులు జన గణన డేటా నుండే రావాలని సీపీఐ(ఎం) పేర్కొంది. హెచ్‌ఎల్‌‌సీడీసీ చేపట్టిన ప్రస్తుత ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఈ కమిటీని రద్దు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ ‌చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్