వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి జిల్లా కేంద్రానికి రానున్న ఆయన పలు అభివృద్ధి కార్య క్రమాల్లో పాల్గొనడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసం గించనున్నారు. తొలుత మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికా రులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరు కుని అంబేడ్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణం నుంచే వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం సిరిసిల్ల రగుడు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.







కామెంట్‌లు (0)