ప్రచారంతో డిపోల్లో హడావిడి
తమదే విజయమంటున్న సంఘాలు కార్మికుల ప్రసన్నం కోసం తిప్పలు మ్యానిఫెస్టోలతో ముందుకు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస(టీజీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల హడావిడి పెరుగుతున్నది. మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో సంఘాల ప్రచారం ఊపందుకుంది. దాదాపు పదేండ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదిన పోలింగ్ నిర్వహించనున్నారు. డిపోల నుంచి రీజియన్ స్థాయి వరకు ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పదుల సంఖ్యలో కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారం మరింత వేడెక్కింది. అక్టోబర్ తొమ్మిది ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించి, అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడించనున్నారు. గుర్తింపు సంఘం కోసం మొత్తం 12 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. బతుకమ్మ, నిచ్చె న, కత్తెర, బస్సు, బస్సు టైరు, పులి, ధర్మచక్రం, బాణం, నక్షత్రం(స్టార్), చేతిలో కాగడా, గధ తదితర గుర్తులను సంఘాల కు కేటాయించారు. గుర్తులు ఖరారు కావడంతో డిపోల వారీగా కార్మికులను కలుస్తూ సంఘాల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నా రు. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరుగు తుండటంతో ప్రతి సంఘం తన బలాన్ని చాటుకునేందుకు వ్యూహా రచన చేస్తున్నాయి. ఎన్నికల వేళ యూనియన్ల మధ్య పొత్తులు కూడా కీలకంగా మారుతున్నాయి. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కలిసి పోటీచేస్తున్నాయి. ఇతర సంఘాలు అదే ప్రయత్నంలో ఉన్నాయి.
ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దాూర్ యూనియన్, నేషనల్ మజ్దార్ యూనియన్ బరిలో ఉన్నాయి. ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు అంశం కూడా చర్చనీ యాంశమవుతున్నది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ , ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాల ఎన్నికలు కేవలం యూనియన్ల మధ్య పోటీగా కాకుండా రాజకీయ పార్టీల వ్యవహారంగా మారిపోయింది. అయితే తుది ఫలితాన్ని ఆర్టీసీ ఉద్యో గుల రహస్య బ్యాలెట్ ఓటింగ్ నిర్ణ యించనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్య లే ప్రస్తావనకు వస్తున్నాయి. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం. ఉద్యోగుల వేతన సవరణలు, పెండింగ్ పీఆర్సీ బకాయిలు, డీఏలు, బోనస్లు, సర్వీసు నిబంధనలు, పని ఒత్తిడి, సిబ్బంది కొరత వంటి అంశాలు కీలకంగా మారాయి. ఆయా సంఘాలు ఎన్నికల్లో గెలిపిస్తే తాము చేయదలిచిన పనుల గురించి మ్యానిఫెస్టోల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాయి.
డిపోల్లో ప్రచారం
ఎన్నికల్లో విజయం సాధించే సంఘానికి ఆర్టీసీలో గుర్తింపు సంఘం హోదా రానుంది. కార్మికుల వేతనాలు, సర్వీస్ సమస్యలు, డీఏలు, బోనస్లు, ఇతర ఉద్యోగ సంక్షేమ అంశాలపై యాజమాన్యంతో అధికారిక చర్చలు జరిపే అవకాశం ఈ సంఘానికి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం అంశంపై జరిగే చర్చల్లోనూ గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం కీలకంగా మారనుంది. అందుకే ఈ ఎన్నికలను కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటు న్నాయి. దీంతో డిపోల వద్ద యూనియన్ నేతలు, కార్యకర్తల సందడి పెరుగుతున్నది. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది. ఇతర ఉద్యోగులను కలిసి తమ సంఘాలనికి, తమ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.







కామెంట్‌లు (0)