Magazines

సిరిసిల్లలో కేటీఆర్ భూభాగోతం బయటపెడతాం

49 నిమిషాల క్రితం

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేడు సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సినిమా చూపించబోతున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజల ముందే ఆయన భూభాగోతాన్ని సీఎం రేవంత్ రెడ్డి బయటపెడతారని తెలిపారు. సెప్టెంబర్ 30 కేటీఆర్ కు మరిచిపోలేని రోజు అవుతుందని ఎద్దేవా చేశారు. తొమ్మిదినరేండ్ల భాగోతం బయటపడబో తుందని తెలిపారు. రూ.345.75 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.200 కోట్ల తో యుంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీఎం శంకుస్థాపన, నేతన్నలకు ప్రత్యేక బజార్, వేములవాడ లో రూ.99.40 కోట్ల పనులకు శంకుస్థాపన సీఎం చేయబోతున్నారని చెప్పారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదనీ, శంకుస్థాపనలకే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేయకుండా కేటీఆర్ అడ్డుపడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, మూసీ, ట్రిబుల్ ఆర్, బుల్లెట్ ట్రైన్ రాకుండా బహుదూర్ గూడ ప్రజలను రెచ్చగొట్టి భూ సర్వే ను అడ్డుకోవాలని కేటిఆర్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బహుదూర్ గూడ రైతులతో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ కొంగర కలాన్ రైతులను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్