Magazines

‌కేటీఆర్‌ పాస్‌‌పోర్టును ఎందుకు జప్తు చేయాలి?

45 నిమిషాల క్రితం

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
బీఆర్ఎస్ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‌పాస్‌‌పోర్టును ఎందుకు జప్తు చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ వాళ్లు మెమో మాత్రమే దాఖలు చేశారనీ, కేటీఆర్‌కు, న్యాయవాదికి ‌కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లి స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డికి నచ్చలేదని అన్నారు. ఆయన పాస్‌పోర్ట్ ‌జప్తు చేశారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ పాస్‌పోర్ట్ కూడా ‌జప్తు చేయాలని అనుకుంటున్నారని వివరించారు. కేటీఆర్‌పై పెట్టింది అక్రమ కేసని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి 52 రోజులు జైల్లో ఉన్నారనీ, ఆయనపై తీవ్రమైన కేసు ఉందని గుర్తు చేశారు. సీఎంగా ఉన్నా రేవంత్ రెడ్డి పాస్ పోర్టు న్యాయస్థానాల్లోనే ఉందన్నారు. సబ్ స్టేషన్లకు పిలిచిన టెండర్లు రద్దు చేసే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మెన్ రాజీవ్ సాగర్, బీఆర్ఎస్ నేతలు కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, కురువ పల్లయ్య, వీరబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదో కుట్ర : దాసోజుశ్రవణ్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను తీవ్రతరం చేసిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలనే కుట్రకు తెరలేపిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీబీ కోర్టు ద్వారా ఈ కుట్ర పన్నడం అత్యంత దుర్మార్గమైన అధికార దుర్వినియోగమని విమర్శించారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు, కక్షసాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్