Magazines

విధుల్లో ఉండగా గుండెపోటుతో సీఐ మృతి

59 నిమిషాల క్రితం

CI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విజయవాడ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పనిచేస్తున్న అహ్మద్ అలీ, విధుల్లో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే, ఆదివారం సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీఐ అహ్మద్ అలీ తన సిబ్బందితో కలిసి గాంధీ నగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధుల్లో పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ, చురుకుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

వెంటనే అప్రమత్తమైన సహచర సిబ్బంది, ఇతర అధికారులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స అందించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్