నవతెలంగాణ - అమెరికా: విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ-5 గ్రీన్‌కార్డు దరఖాస్తు ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త రుసుములు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త ఫీజులు ఇలా..
గుర్తింపు పొందిన రీజినల్ సెంటర్ ద్వారా పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు దాఖలు చేసే I-526E దరఖాస్తు రుసుము 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు పెరగనుంది. దీనికి అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు చెల్లించాలి. శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించాలని కోరుతూ పెట్టుబడిదారులు దాఖలు చేసే I-829 దరఖాస్తు ఫీజును 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెంచనున్నారు. అమెరికా వాణిజ్య సంస్థల్లో పెట్టుబడికి ఆమోదం కోరుతూ దాఖలు చేసే I-956F ఫామ్ ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 42,675 డాలర్లకు పెరగనుంది.
భారతీయులపై ప్రభావం..
అమెరికాలో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడమే లక్ష్యంగా 1990లో యూఎస్ కాంగ్రెస్ ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఈ పథకం కింద దరఖాస్తుదారులు అమెరికా వ్యాపారాల్లో 1.05 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా కనీసం 10 ఫుల్‌టైమ్ ఉద్యోగాలను సృష్టించాలి. ఈ అర్హతలను పూర్తి చేసిన విదేశీ ఇన్వెస్టర్‌తో పాటు వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.






కామెంట్‌లు (0)