నవతెలంగాణ -హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విమాన ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ నుంచి విజయవాడ బయల్దేరిన 591 ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ లోపాన్ని గుర్తించి ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)