Magazines

రష్యాలో సైనిక విమానం కూలి ఆరుగురు మృతి

54 నిమిషాల క్రితం

russian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమూర్‌ ప్రాంతంలో టుపోలెవ్‌ టు-95ఎంఎస్‌ వ్యూహాత్మక బాంబర్‌ కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు సిబ్బందిలో ఆరుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. జనావాసాలు లేని ప్రాంతంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ బాంబర్‌లో ప్రమాద సమయంలో ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేవని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్