Magazines

యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం

1 గంట క్రితం

Ponguleti-Srinivas-Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న యూఎల్సీ కేసులను పరిశీలించి, నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. యూఎల్‌సీ భూములపై 2016లో జీవో జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


22-ఏ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జీవో 118, 76లకు అనుగుణంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. 22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యలకు కూడా ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కారం చూపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్