Magazines

ఇజ్రాయిల్‌తో సంబంధాలు వద్దు

25 నిమిషాల క్రితం

Israel
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

అమ్‌స్టర్‌డామ్‌లో భారీ ప్రదర్శనలు

అమ్‌స్టర్‌డామ్ : ఇజ్రాయిల్‌తో కొనసాగిస్తున్న సైనిక, ఆర్థిక సంబంధాలకు స్వస్తి చెప్పాలని, ఆ దేశానికి ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌ డామ్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రా యిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు రాజధాని వీధుల్లో కదం తొక్కారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫామ్, నోవిబ్ వంటి ప్రముఖ మానవతా సంస్థలు ఈ ప్రదర్శనకు మద్దతు ఇచ్చాయి. ప్రదర్శనకారులు ఎరుపు రంగు దుస్తులు ధరించి, పాలస్తీనా పతాకాలు చేత పట్టుకొని మ్యూజియం స్క్వేర్‌కు తరలి వచ్చారు. ఇజ్రాయిల్ ఆక్రమ నివాస ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులపై పూర్తిగా నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు.

డేటా సెంటర్‌పై దాడి

ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ బృందాలు కూడా గత శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించాయి. అమ్‌స్టర్‌డామ్ శివారులో నిర్మిస్తున్న నూతన డేటా సెంటర్ వద్దకు సుమారు వంద మందికి పైగా నిరసనకారులు చేరుకొని లోపలికి చొరబడ్డారు. కంచెలు దూకి, క్రేన్‌ల పైకి ఎక్కి బ్యానర్లు ప్రదర్శించారు. డేటా సెంటర్ల నిర్మాణం కారణంగా భారీగా విద్యుత్, నీటి వినియోగం జరుగుతోందని, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని వారు మండిపడ్డారు. నిరసనలు తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకొని 200 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్