Wednesday, April 15, 2026
E-PAPER
Homeఖమ్మంకనీసం వంద మందికి ఉపాధి కల్పించాలి 

కనీసం వంద మందికి ఉపాధి కల్పించాలి 

- Advertisement -

– డీ ఆర్డీఓ విద్యాలత
నవతెలంగాణ – అశ్వారావుపేట 

రోజువారీ మండల వ్యాప్తంగా ప్రతి పంచాయితీ నుండి కనీసం వందమంది కూలీల కు ఉపాధి కల్పించాలని డీఆర్డీఓ విద్యాలత మండల అధికారులకు సూచించారు. బుధవారం ఉపాధి హామీ పథకం పై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం లో వారు పాల్గొన్నారు. ఉపాధి కూలీల ను వందశాతం ఎన్ఎంఎంఎస్ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్ఎంఎంఎస్ యాప్ లో కూలీ ల ను వందశాతం నమోదు చేసిన మండలంలోని మల్లాయిగూడెం క్షేత్రస్థాయి సహాయకురాలు లక్ష్మీకాంతం ను డీ ఆర్డీఓ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ రమణారావు,డీఆర్పీ శ్రీలత, ఎంపీడీవో అప్పారావు,ఏపీఓ రామచంద్రరావు, సాంకేతిక సహాయకులు,కార్యదర్శులు,క్షేత్ర సహాయకులు,మేట్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -