Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ రోడ్డుకిరువైపుల ముళ్ళపొదలను తొలగించిన సర్పంచ్

బస్వాపూర్ రోడ్డుకిరువైపుల ముళ్ళపొదలను తొలగించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ -జుక్కల్
మండలంలోని బస్వాపూర్ జిపి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా బస్వాపూర్ రోడ్డుకిరువైపులా పెరిగిన ముళ్ళపొదలను శుక్రవారం సర్పంచ్ రమణ సురేష్ గొండ తొలగింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆర్అండ్ బి పెద్ద రోడ్డు నుండి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు మార్గం గుండా ఇరువైపులా ముళ్ళపదలు పిచ్చి చెట్లు పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. ఈ మళ్ళపొదలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక నుంచి అటువంటి సమస్య గ్రామస్థులు పడొద్దని ఈ పనికి పూనుకున్నానని అన్నారు. గ్రామాభివృద్దే నా లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోగ్రామ ఉప సర్పంచ్ బి. అనిల్, వార్డు సభ్యులు, ఏ శివాజీ పటేల్, కె. మల్లు గొండ, గ్రామస్తులు బి. బస్వంత్, షేక్ షబ్బీర్, అహ్మద్, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -