– తప్పిన పెను ప్రమాదం
– అప్రమత్తమైన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందికి దించివేశారు
– బస్సు మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ వైపు వెళ్తుండగా
నవతెలంగాణ-హైదరాబాద్: స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీదుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం రాత్రి మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్లేందుకు బయల్దేరింది. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ సమీపంలోని పద్మావతి ప్లాజా బస్‌స్టాప్ వద్ద ఆగి ఉంది. రాత్రి 10.45 గంటల సమయంలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో తొలుత మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను కిందికి దించివేశారు. అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఘటనాస్థలికి ట్రాఫిక్ సీఐ జానయ్య, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.
కేపీహెచ్‌బీలో బస్సు దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



