Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయం'టైమ్‌' ప్రభావశీలుల జాబితా

‘టైమ్‌’ ప్రభావశీలుల జాబితా

- Advertisement -

– ట్రంప్‌, జిన్‌పింగ్‌, మమ్దానీ వంటి నాయకులకు చోటు
– నేపాల్‌, బంగ్లా పీఎంలకూ దక్కిన స్థానం
– కనిపించని భారత ప్రధాని మోడీ పేరు

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ 2026 సంవత్సరానికి విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలో ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, టెక్‌ నిపుణులు, కళాకారులు చోటు సంపాదించారు. లీడర్స్‌ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రెసిడెంట్‌ షీ జిన్‌పింగ్‌, న్యూయార్క్‌ యువ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఉన్నారు. భారత ప్రధాని మోడీకి మాత్రం ఈ జాబితాలో స్థానం దక్కకపోవడం గమనార్హం. అయితే ముగ్గురు భారతీయులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్‌ మ్యాగజైన్‌ 2026 ఏడాదికి గానూ ‘టైమ్‌ 100 ప్రభావశీలుల జాబితా’ను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ రాజకీయాలు, వ్యాపారాలు, సాంకేతికత, కళలు, సామాజిక రంగాల్లో ప్రభావం చూపిన వంద మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

కనిపించని మోడీ పేరు
ఈ జాబితాలో భారత ప్రధాని మోడీ పేరు కనిపించలేదు. అయితే పొరుగుదేశాలైన నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా, బంగ్లాదేశ్‌ ప్రధాని తారిక్‌ రెహ్మాన్‌లు ఈ జాబితాలో పేర్లు సంపాదించారు. న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ వంటి నాయకులు చోటు సంపాదించారు. ట్రంప్‌, జిన్‌పిం గ్‌లతో పాటు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, క్యాథలిక్‌ చర్చ్‌ హెడ్‌ పోప్‌ లియో 14, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, మెక్సికో ప్రెసిడెంట్‌ క్లాడి యా షీన్‌బామ్‌, జపాన్‌ ప్రధాని సనై తకైచీ, కాలిఫోర్నియా గవర్నర్‌ గవీన్‌ న్యూసొమ్‌, యూఎస్‌ ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, యూఎస్‌ సెనెటర్‌ మార్క్‌ కెల్లీ వంటి నాయకులు ఈ ప్రభావశీలుల జాబితాలో ఉన్నారు.

ముగ్గురు భారతీయులకు చోటు
ఈ ఏడాది ముగ్గురు భారతీయులు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించారు. ఇందులో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచారు, బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, ప్రఖ్యాత చెఫ్‌ వికాస్‌ ఖన్నాలు ఉన్నారు. వికాస్‌ ఖన్నా ముఖ్యంగా భారతీయ వంటకాలను ప్రపంచస్థాయిలో పరిచయం చేసిన ప్రముఖ చెఫ్‌గా గుర్తింపు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -