ఆసియాలోనే టాప్ కుబేరుడిగా చోటు
ముంబయి : అదానీ గ్రూపు చైర్మెన్ గౌతం అదానీ సంపదలో ముకేశ్ అంబా నీని దాటేశారు. ఇటీవల అదానీ గ్రూప్ షేర్లు మార్కెట్‌లో దూసుకుపోవడంతో గౌతమ్ అదానీ తన చిరకాల ప్రత్యర్థి ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. అదానీ నికర విలువ 92.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.5లక్షల కోట్లు)కు చేరుకోగా.. అంబానీ 90.8 బిలియన్ డాలర్ల (8.40 లక్షల కోట్లు)తో తర్వాతి స్థానానికి పడిపోయారు. కేవలం ఒక్క రోజులోనే అదానీ తన సంపదకు 3.56 బిలియన్లు (రూ.33వేల కోట్లు) జోడించుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా అదానీ ర్యాంక్ 19గా, అంబానీ ర్యాంక్ 20గా ఉంది. టాప్ 500లో 23 మంది భారతీయ పెట్టుబడిదారులున్నారు. అధిక ధరలతో సామాన్యుడి జేబు ఖాళీ అవుతున్న వేళ.. బిలియనీర్ల ఆస్తుల పెరుగు దలపై జరుగుతున్న చర్చ ఆర్థిక నిపుణుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. పెరుగు తున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల అస్థిరత, తగ్గుతున్న కొనుగోలు శక్తి కారణంగా సామాన్యుల పొదుపు హరించుకుపోతోంది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్న తరుణంలో సగటు భారతీయుడి వాస్తవ ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవడం గమ నార్హం.ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అదానీ సంపద 8.1 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 కుబేరులలో ఏడుగురు నష్టాలను చవి చూశారు. అంబానీ సంపద కూడా 16.9 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న పోటీ కేవలం 1.8 బిలియన్లకే పరిమితమైంది. స్టాక్ మార్కెట్ ఒడిదు డుకులపై ఆధారపడి సాగే ఈ నంబర్ వన్ పోరులో సామాన్యుల భాగ స్వామ్యం మాత్రం వరుస నష్టాలతో ఆందోళకరంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని ఒకవైపు గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందనే ఆందోళన ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది. అదానీ, అంబానీల మధ్య సాగుతున్న ఈ సంపద యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచుతు న్నట్లు కనిపిస్తు న్నప్ప టికీ, క్షేత్రస్థాయిలో సామాన్యుడి కష్టాలు, ఆదాయ అసమానతలు మాత్రం ఇంకా సవాలుగానే మిగిలి ఉన్నాయి. ఈ సంపద కేంద్రీకరణ సంకేతాలు భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక అంతరాలను పెంచుతాయనేది సుస్పష్టం.
అంబానీని మించిన అదానీ
- Advertisement -
- Advertisement -



