Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలి: సర్పంచ్ శ్యామల శేఖర్

తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలి: సర్పంచ్ శ్యామల శేఖర్

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్‌: అంగన్వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్-పోషిక పక్షం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై అవగాహన కల్పించాలని అంగన్ వాడీ టీచర్లకు సూచించారు. అనంతరం కట్టంగూర్ పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనుల వద్దకు వెళ్లి కూలీలకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి, శ్రీదేవి. పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్, అంగన్వాడీ టీచర్లు మంగమ్మ, భిక్షమమ్మ, పద్మ, సంధ్య, శోభారాణి, సైదమ్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -