నవతెలంగాణ – ఆలేరు రూరల్
టీజీఈజాక్ పిలుపు మేరకు శుక్రవారం ఆలేరు మండలంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద లంచ్ బ్రేక్ సమయంలో పెద్ద ఎత్తున చేరుకుని తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.అనంతరం జాక్ తరపున మండల తహశీల్దార్‌కు మెమొరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించాలని, రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పసుపులేటి నరేంద్ర స్వామి,జిట్టబోయిన సైదులు,దూడల వెంకటేష్,బూషపాక రాములు,జిల్లా నాయకులు బొమ్మకంటి బాలరాజు,పూల నాగయ్య,మండల నాయకులు దశమంత్ రెడ్డి,సయ్యద్,శంకర్,రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయులు కుమారస్వామి,ఖాజా, అలుగుబెల్లి హేమలత,రిష్మా తదితరులు పాల్గొన్నారు.



