Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్ పాఠశాలలో ఘణంగా ఫేర్వెల్ పార్టీ

మైబాపూర్ పాఠశాలలో ఘణంగా ఫేర్వెల్ పార్టీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శుక్రవారం హెచ్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థినీ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగ వాతావరణం లేని ఎంజాయ్ గా ఒకరి ఒకరు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆ లింగనం చేసుకున్నారు. ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో అందరూ కలిసి సంహ భోజనాలు ఉపాధ్యాయులు గ్రామస్తులతో కలిసి విద్యార్థులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఎస్.కె ముకిద్,  శ్రీదేవి , గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్ రెడ్డి ఉపసర్పంచ్ ఇర్ఫాన్ ఆరిఫ్ ,  గ్రామ బీఆర్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -