– అశ్వారావుపేట మండల కమిటీ నుంచి రూ.50 వేల అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల నిర్వహణకు అశ్వారావుపేట రైతు సంఘం మండల కమిటీ నుండి రూ.50 వేలు నగదు విరాళాన్ని శుక్రవారం పాల్వంచ లో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం జిల్లా మహాసభల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు అద్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు కు అందజేశారు. ఈ నెల ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల ఖర్చుల నిమిత్తం నిధులను సమకూర్చినట్లు మండల నాయకులు తెలిపారు.
రైతు సమస్యల పరిష్కారం, రైతుల హక్కుల సాధనలో ఈ మహాసభలు కీలకంగా నిలవాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కరపాటి పుల్లయ్య, నాయకులు గడ్డం సత్యనారాయణ, శీసం రాము, మడకం శాంతి, కలపాల బద్రయ్య, నారం అప్పారావు, మడకం నాగేశ్వరరావు, మడివి దుర్గారావు, సంతపూరి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.



