Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన జైళ్ళ శాఖ డీజీపీ

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన జైళ్ళ శాఖ డీజీపీ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుందని,సురక్షిత ప్రయాణం… సుఖమయ జీవనం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తుంగతుర్తి సిడిపిఓ శ్రీజ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర జైళ్ల శాఖ డిజిపి సౌమ్య మిశ్రా ఐపీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు,ఆశాకార్యకర్తలకు,రోడ్డు భద్రత నియమాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు తరలి వెళ్తూ మాట్లాడారు. ఈ మేరకు డీజీపీ చెప్పిన ప్రతి విషయాన్ని గ్రామాలలో అమలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించడం,డ్రంక్ అండ్ డ్రైవ్,అతివేగం,గోల్డెన్ అవర్ ల గురించి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -