నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని మగ్గిడి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిరు. సుంకరి ప్రతిప,శార్తి రిషి ప్రియ ఎస్జిఎఫ్ బీచ్ వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మధు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ నెలలో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో ఉత్తమంగా రాణించి జట్టును మొదటి స్థానంలో నిలిపారని తెలిపారు. గోవా రాష్ట్రం పానాజీలో ఏప్రిల్ 21- 24 వరకు జరిగే జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో ఆడనున్నారని తెలిపారు. వారి ఎంపిక పట్ల జిల్లా ఎస్జిఎఫ్ జిల్లా సెక్రెటరీ నాగమణి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ వీడీసీ సభ్యులు ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేసినారు.
జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు మగ్గిడి పాఠశాల విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



