Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోల్డెన్ అవర్ ప్రాణ రక్షణలో కీలకం: ఎస్సై వెంకట్ రెడ్డి

గోల్డెన్ అవర్ ప్రాణ రక్షణలో కీలకం: ఎస్సై వెంకట్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన “అరైవ్-అలైవ్” అవగాహన కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే తొలి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గుండె ఆగిపోతున్న సందర్భాల్లో సీపీఆర్ (CPR) చేయడం ద్వారా ప్రాణాలు నిలబెట్టవచ్చని చెప్పారు.

కార్యక్రమంలో వైద్యాధికారులు సీపీఆర్ చేసే విధానాన్ని ప్రదర్శనతో ప్రజలకు వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ సునీత, ఎంపీడీవో రేవత్ రెడ్డి, వైద్యాధికారులు స్వప్న, సర్పంచ్ చింతగాల శ్రీనివాసులు, నాయకులు కట్ట అనంతరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శేఖర్ గౌడ్, పోలీస్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -