– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
– హసాకొత్తూర్ లో రహదారి భద్రతపై అవగాహన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ద్విచక్ర వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, కార్ల లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని హసాకొత్తూర్ గ్రామంలో రహదారి భద్రత, మత్తు మందు, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సభ గ్రామ పంచాయతీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.నో హెల్మెట్ నో రైడ్ అని స్పష్టం చేశారు.గ్రామాలలో యువతీ యువకులు మత్తు మందులు, గంజాయికి అలవాటై చెడిపోతున్నారని, ఇంటి వద్ద తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టి వారిని సరైన దారిలో నడిచే విధంగా చూడాలన్నారు.ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా తగు చర్యలు తీసుకొని స్టీలు మాత్రమే వాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణా శ్రీ, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్, వార్డు సభ్యులు పెద్ది సృజన్, కుందేటి శ్రీనివాస్, కనక నరసయ్య, రాదరపు గంగాధర్, కల్లేడ రాణి, పసుల గంగుబాయి, చెరుకు జమున, ఏఎన్ఎం మమత, ప్రముఖ న్యాయవాది ఎలేటి గంగాధర్, ఐకేపీ సీసీ అలేఖ్య, అంగన్వాడిలు, ఆశాలు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ క్యాబినెట్ సభ్యులు, గ్రామంలోని దుకాణం దారులు, తదితరులు పాల్గొన్నారు.



