Saturday, April 18, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యార్థినీలకు కరాటే శిక్షణ

విద్యార్థినీలకు కరాటే శిక్షణ

- Advertisement -

– ఎల్లో బెల్ట్ సర్టిఫికెట్ల పంపిణీ
నవతెలంగాణ – అశ్వరావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలికల స్వీయరక్షణ కోసం నిర్వహించిన కరాటే శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. భద్రాద్రి మార్షల్ ఆర్ట్స్ & స్పోర్ట్స్ అసోసియేషన్ (మిక్సోకై హయషి- హ శితో – ర్యు కరాటే – డో ఇండియా) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉత్తమ కరాటే మాస్టర్ అవార్డు గ్రహీత,తెలంగాణ సీనియర్ కరాటే మాస్టర్ జి.శేఖర్ పర్యవేక్షణలో,ఆయన శిష్యుడు గడ్డం వెంకన్న బాబు (బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్) శిక్షణ అందించారు.

అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు కరాటే శిక్షణ పొందిన 24 మంది బాలికలకు, భద్రాచలం కు చెందిన సీనియర్ కరాటే ఇన్స్ట్రక్టర్ ముర్రం నాగార్జున జ్ఞాపకార్థం ఎల్లో బెల్ట్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.ఎం. ఎస్‌కే షాహినా బేగం, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. అదేవిధంగా అశ్వరావుపేట, బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లోని 13 పాఠశాలల్లో మొత్తం 170 మంది బాలికలకు ఉచితంగా ఎల్లో బెల్ట్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

ఈ సర్టిఫికెట్లను గడ్డం వెంకన్న బాబు, జి. శేఖర్ స్వయంగా అందజేశారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు స్వీయ రక్షణ నైపుణ్యాలు అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -