నవతెలంగాణ – భువనగిరి
ఎస్ సి కార్పొరేషన్ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాల మంజూరులో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదని ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. వెంటనే ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించిన ఎన్పి ఆర్డీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కలిసి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లా స్థాయిల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు ప్రస్తావన లేదన్నారు.వెంటనే ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ సవరించలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్, బొల్లెపల్లి స్వామి, కొత్త లలిత పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



