నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్వాడీ సెంటర్-8లో టీచర్ ఓదెల లక్ష్మీ ఆధ్వర్యంలో శనివారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడారు గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు.
డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని,దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం అత్యంత అవసరమని, ఈ కాలాన్ని “గోల్డెన్ డేస్”గా పేర్కొన్నారు.అలాగే రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేర్చుకోవాలని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికాహారం తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ఆయా పాల్గొన్నారు.



