Sunday, April 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాజకీయ లబ్ది కోసమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు

రాజకీయ లబ్ది కోసమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు

- Advertisement -

– 2023లో ఆమోదం పొందిన బిల్లు ఏమైంది? : సెమినార్‌లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ -ఖమ్మం

‘2014లోనే తేవాల్సిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును మరుగున పడేటట్టు కేంద్రం చేసింది. 2023లో పార్లమెంటులో పాస్‌ చేసిన అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దాటవేసి ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వార్థపూరితంగా వాడుకోవాలని చూసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా, ఓటింగ్‌ ప్రతిపాదన పెట్టడం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు, డీలిమిటేషన్‌కు సంబంధం లేకపోయినా వాటికి లింక్‌ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి. డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది’ అని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శనివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చట్ట సభలలో ‘మహిళా రిజర్వేషన్‌ ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అధ్యక్షతన సెమినార్‌ జరిగింది. డీలిమిటేషన్‌ వల్ల మహిళలకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు అని అన్నారు. మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టి చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, ఇంటా బయట సమాన హక్కులు, సమాన హోదా కల్పించి చట్ట సభలలో కూడా మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించిన నాడే నిజమైన మహిళా రిజర్వేషన్‌ బిల్‌ ఆమోదయోగ్యమవుతుందని అన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ మహిళలపై అణిచివేతను దాడులను అసమానతులను అరికట్టిన నాడే మహిళలు స్వేచ్ఛగా ఉండగలరని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -