రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామాతో రూపొందుతున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రం హీరో సుమంత్ ప్రభాస్ అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించ నున్నారు. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. మాది హన్మకొండ. మా నాన్న సంగీతకారుడు. ఆయన ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. అక్కడ మాకు స్టూడియో ఉంది. మా నాన్న దగ్గర నేను కీబోర్డ్ నేర్చుకున్నాను. షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నప్పుడు సుభాష్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన మొదటగా ‘క్లౌడ్ నైన్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు అవకాశం ఇచ్చారు. తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘ప్రయాణం’ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌కి పని చేశాను. భవిష్యత్తులో సినిమా చేస్తే తప్పకుండా కలిసి పనిచేద్దామని చెప్పిన సుభాష్ ఆ మాట నిలబెట్టుకున్నారు. అలా నాకు ఈ సినిమా వచ్చింది. నేను సాయి కార్తీక్, అనుప్ రూబెన్స్, జి.వి. ప్రకాష్, జస్టిన్ ప్రభాకర్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో పని చేశాను.
వారందరి దగ్గర పని చేయడం వల్ల మంచి అనుభవం వచ్చింది. సుభాష్ సినిమాలన్నీ చాలా క్లీన్‌గా ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటూనే మంచి కమర్షియల్ టచ్ కూడా ఉంది. ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అలాగే ఆయన అద్భుతమైన సిచ్చువేషన్స్ చెప్పారు. దానికి తగ్గట్టు మ్యూజిక్ చేశాను. అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందులో బ్రేకప్ యాంథమ్, అలాగే చిత్ర, ఎస్పీ చరణ్ పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో బిట్ సాంగ్స్ కలిపి మొత్తం 7 పాటలు ఉన్నాయి. అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మంచి లవ్ స్టోరీ. అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత అభినవ్ మ్యూజిక్ కోసం కావలసిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా అందించారు.
అందరికీ కనెక్ట్ అయ్యే ప్రేమకథ
- Advertisement -
- Advertisement -



