Sunday, April 19, 2026
E-PAPER
Homeబీజినెస్బ్యాంక్‌లకు లాభాల పంట..

బ్యాంక్‌లకు లాభాల పంట..

- Advertisement -

హెచ్‌డీిఎఫ్‌సీ తుది డివిడెండ్‌ రూ.13
న్యూఢిల్లీ
: ప్రయివేటు రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లు మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో మొండి బాకీలకు కేటాయింపులు తగ్గించుకోవడం ద్వారా అధిక లాభాలను నమోదు చేశాయి. దిగ్గజ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ గడిచిన క్యూ4లో 9 శాతం వృద్ధితో రూ.19,221 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం రూ.33,082 కోట్లుగా నమోదయ్యింది. మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు 18 శాతం తగ్గడం మెరుగైన ఫలితాలకు దోహదం చేశాయి. ఈ సందర్బంగా ఇన్వెస్టర్లకు ప్రతి షేర్‌పై రూ.13 తుది డివిడెండ్‌ ను సిఫార్సు చేయగా ఈ ఏడాదికి మొత్తం డివిడెండ్‌ రూ.15.50కి చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -