Saturday, April 18, 2026
E-PAPER
Homeబీజినెస్నెట్‌ఫ్లిక్స్‌ ఛైర్మన్‌ హేస్టింగ్స్‌ నిష్క్రమణ

నెట్‌ఫ్లిక్స్‌ ఛైర్మన్‌ హేస్టింగ్స్‌ నిష్క్రమణ

- Advertisement -

వాషింగ్టన్‌ : ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్‌ రీడ్‌ హేస్టింగ్స్‌ (65) తన 29 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. 1997లో ఒక చిన్న డివిడి అద్దె సర్వీస్‌గా ప్రారంభమైన సంస్థను ప్రపంచ స్థాయి వినోద సామ్రాజ్యంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇకపై తన సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించనున్నట్టు ప్రకటించిన హేస్టింగ్స్‌, రాబోయే వార్షిక సమావేశంలో తిరిగి ఎన్నికలకు నిలబడటం లేదని స్పష్టం చేశారు. హేస్టింగ్స్‌ నిష్క్రమణతో ఒక్క రోజులో నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ 9 శాతం క్షీణించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -