Saturday, April 18, 2026
E-PAPER
Homeబీజినెస్కరెంట్‌ ఎకౌంట్‌ లోటు కుదుపు

కరెంట్‌ ఎకౌంట్‌ లోటు కుదుపు

- Advertisement -

జీడీపీలో 2 శాతానికి చేరొచ్చు
క్రిసిల్‌ రేటింగ్‌ ఎజెన్సీ అంచనా.

న్యూఢిల్లీ : ముడి చమురు ధరలు పెరిగితే భారతదేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) జీడీపీలో 2 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ వెల్లడించింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధిక టారిఫ్‌లకు తోడు ముడిచమురు ధరలు సగటున బ్యారెల్‌కు 75-80 డాలర్ల మధ్య ఉంటే గత ఆర్థిక సంవత్సరం 2025-26 శాతానికి 0.8 శాతంగా అంచనా వేయగా.. ప్రస్తుత 2026-27లో సీఏడీ 1.5 శాతానికి చేరొచ్చని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే రాబడి కంటే భారత చెల్లింపులు అధికంగా ఉన్నప్పుడు కరెంట్‌ ఎకౌంట్‌ లోటు ఏర్పాడుతుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 82-87 డాలర్ల వద్ద కొనసాగితే.. ఈ లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే.. సేవల రంగానికి సంబంధించిన వాణిజ్యం మిగులులో ఉండటం వల్ల ఈ లోటు మరికొంత పెరగకుండా పరిమితం కావచ్చని నివేదిక తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. దాని కాలపరిమితి, తీవ్రత వంటి అంశాలు అంతర్జాతీయ వాణిజ్యం, వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషించింది.గత ఫిబ్రవరి వరకు సగటున 0.3 శాతం వృద్ధిని నమోదు చేసిన భారతదేశ వస్తువుల ఎగుమతులు.. మార్చి నెలలో గతేడాదితో పోలిస్తే 7.4 శాతం తగ్గి 38.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఈ క్షీణతకు ప్రధానంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 29.3 శాతం పడిపోవడం ప్రధాన కారణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -