- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జెబ్రానిక్స్ కొత్తగా గూగుల్ టీవీ సపోర్ట్‌తో కూడిన జెబ్-పిక్సాప్లే 77జి స్మార్ట్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 7500 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో 200 అంగుళాల వరకు బిగ్‌స్క్రీన్ థియేటర్ అనుభూతిని అందిస్తుందని జెబ్రానిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు. ప్రీమియం వినోదాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగా ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించామన్నారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ యాప్స్ నేరుగా వాడుకునే వీలుండటంతో పాటు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయన్నారు.
- Advertisement -



