భూక్య సుమలత సర్పంచ్ పసర గ్రామపంచాయతీ
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతుల ఆర్థిక అభివృద్ధిని ఎదుగుదలను రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని పసర సర్పంచ్ భూక్య సుమలత అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలో పసర నాగారం శ్వేతాంజలి రాంపూర్ వెన్నెల గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సుమలత ఓపెన్ చేసి కొనుగోలను ప్రారంభించారు.
సందర్భంగా సర్పంచ్ సుమలత మాట్లాడుతూ రైతు పండించిన పంటను మధ్య దళారీలకు విక్రయించకుండా నష్టపోకుండా ఉండే విధంగా గ్యారంటీ తో డబ్బులు ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి సంజన రెడ్డి ఏపీఎం సీతారాం, సీసీ సుభాషిని, వివో ఏలు రవళి, విజయ, రమణమ్మ, యమున, మరియు అధ్యక్షురాలు యాస పూలమ్మ, తేనె మాధవి, సువర్ణ, పయనం శీలత, రైతులు లింగయ్య, వెంకన్న, నాగిరెడ్డి, ఐలయ్య లు పాల్గొన్నారు.



