Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం19 ఏళ్ల కింద పట్టాలిచ్చి 
ఇప్పటికీ స్థలాలు కేటాయించరా?

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి 
ఇప్పటికీ స్థలాలు కేటాయించరా?

- Advertisement -


టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

మొయినాబాద్ మున్సిపాలిటీలోని హిమాయత్ నగర్ రెవెన్యూ గ్రామంలో గల పేదలకు 19 ఏండ్ల క్రితం ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇప్పటికీ వారికి స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించాలని కోరుతూ పట్టాదారులు 75 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంపై బుధవారం ‘‘ఎక్స్’’ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పోరాటాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, పేదలకు ఇండ్ల స్థలాలు చూపించే వరకు ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
మట్టి గణపతుల పంపిణీ
టీఆర్ఎస్ చేపట్టిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని కవిత బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయయంలో మట్టి గణపతులను టీఆర్ఎస్ నాయకులు ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -