టీఎన్జీవోలకే కేటాయించాలి
సీఎస్‌కు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గచ్చిబౌలి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాలను ఆ సొసైటీకే కేటాయించాలని టీఎన్జీవో కేంద్రసంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి వి శేషాద్రిని శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి, సొసైటీ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షులు కొండల్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. బీటీఎన్జీవో సొసైటీకి కేటాయించిన స్థలాన్ని ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దాదాపు నాలుగు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ అంశంపై విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES